అమెరికాలో మహిళ, ఆమె కుమార్తెపై దాడి చేసిన భారతీయ యువకుడి అరెస్ట్
- టెక్సాస్‌లో తల్లి, మూడేళ్ల కుమార్తెపై భారత యువకుడి దాడి
- చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు, రెండు పళ్లు ఊడిపోయినట్లు గుర్తింపు
- నిందితుడు అథర్వ వ్యాస్‌ను అరెస్ట్ చేసిన స్థానిక పోలీసులు
- గతంలోనూ నేరచరిత్ర ఉన్నట్లు వెల్లడి, నిందితుడిపై ఐసీఈ డిటైనర్ జారీ
అమెరికాలోని టెక్సాస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శాన్ ఆంటోనియో నగరంలోని ఓ పార్కులో తల్లి, ఆమె మూడేళ్ల కుమార్తెపై అమానుషంగా దాడికి పాల్పడిన భారత జాతీయుడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని 24 ఏళ్ల అథర్వ వ్యాస్‌గా గుర్తించారు.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (డీహెచ్ఎస్) కథనం ప్రకారం, నిందితుడు అథర్వ వ్యాస్.. పార్కులో ఉన్న గాబ్రియెలా పెరెజ్ అనే మహిళ జుట్టు పట్టుకుని కిందపడేశాడు. ఆ తర్వాత ఆమె చేతిలో ఉన్న మూడేళ్ల చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు చిన్నారిని కొరకడంతో రెండు పళ్లు కూడా ఊడిపోయినట్లు అధికారులు తెలిపారు.
అథర్వ వ్యాస్ 2023 ఆగస్టులో స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చాడు. వచ్చిన మూడు నెలలకే 2023 నవంబర్‌లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ క్యాంపస్‌లో దాడి కేసులో అరెస్టయ్యాడు. అయితే, అప్పట్లో అధికారులు అతనిపై కఠిన చర్యలు తీసుకోలేదు. ఏప్రిల్ 2025లో అతని వీసాను రద్దు చేశారు. తాజా ఘటనతో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు అతనిపై అరెస్ట్ డిటైనర్ జారీ చేశారు. స్థానిక చట్టపరమైన చర్యలు పూర్తయ్యాక అతడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.
"ఈ అక్రమ వలసదారుడు చిన్నారిని క్రూరంగా కొరికి రెండు పళ్లు ఊడగొట్టాడు. ఇది అత్యంత అమానుషమైన దాడి," అని హోంల్యాండ్ సెక్యూరిటీ యాక్టింగ్ అసిస్టెంట్ సెక్రటరీ లారెన్ బిస్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నేరస్థులు అమెరికా సమాజంలో స్వేచ్ఛగా తిరగకుండా చూస్తామని ఆమె తెలిపారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.